: పాండ్యరాజన్ ప్లేటు మార్పు వెనక అరుణ్ జైట్లీ!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో కీలకంగా వ్యవహరించిన విద్యాశాఖామంత్రి మాఫోయ్ పాండ్యరాజన్ ఒక్కసారిగా ప్లేటు ఎందుకు మార్చారు? చిన్నమ్మను వదిలేసి పన్నీర్ సెల్వం (ఓపీఎస్) గూటికి ఎందుకు చేరారు? తదితర ప్రశ్నలకు క్రమంగా చిక్కుముడి వీడుతోంది. బడా వ్యాపారవేత్త అయిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రోద్బలంతోనే ఓపీస్ చెంతకు చేరినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం డీఎంకే నుంచి వచ్చి అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న పాండ్యరాజన్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సీటివ్వడమే కాకుండా మంత్రిని కూడా చేశారు. ఈ విషయంలో పాండ్యరాజన్‌కు శశికళ కూడా సహకరించారు. ఆ కృతజ్ఞతతోనే ఆయన తొలుత శశికళకు అండగా నిలిచారు. ఓపీఎస్‌పై ధ్వజమెత్తారు. అయితే పాండ్యరాజన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో జైట్లీ ఆయనకు ఫోన్ చేసి ఓపీఎస్‌కు సహకరించాలని చెప్పినట్టు తెలిసింది. దీంతో మనసు మార్చుకున్న ఆయన పన్నీర్ చెంతకు చేరినట్టు సమాచారం.

More Telugu News