: పాకిస్థానే ట్రంప్ టార్గెట్... చైనా ఏం చేస్తుందో మరి?

ఉగ్రవాదులను, ఉగ్రదాడులకు మద్దతిచ్చే వారిని ఎంతమాత్రమూ సహించబోనని ఇప్పటికే స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడిక పాకిస్థాన్ ను టార్గెట్ చేసుకున్నారు. జైషే మహమ్మద్ చీఫ్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి మసూద్ అజర్ ను చైనాలోకి రానివ్వకుండా నిషేధించాలని ఆయన కోరినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. తమ దేశాధ్యక్షుడు మసూద్ నిషేధంపై చైనా ముందు ప్రతిపాదనలు ఉంచారని, చైనా ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

దీంతో మసూద్ అజర్ పై బ్రిటన్, ఫ్రాన్స్ సపోర్టును సాధించిన భారత్, యూఎస్ మద్దతును సాధించినట్లయింది. వాస్తవానికి అమెరికా శాంక్షన్ కమిటీ నుంచి ఏదైనా ప్రతిపాదన వెళితే, దానిపై 9 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. ఆ తరువాత అది రద్దు కావడమో లేదా బ్లాక్ కావడమో జరుగుతుంది. యూఎస్ ప్రతిపాదన ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి రెండిట్లో ఏది జరిగినా చైనాకది ఎదురుదెబ్బేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

More Telugu News