balaiah: ఎన్టీఆర్ జీవితంపై తీయనున్న సినిమాపై చంద్రబాబు, లోకేశ్ తో చర్చించిన బాల‌కృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే, సినీన‌టుడు బాల‌కృష్ణ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో నిర్వ‌హిస్తోన్న భేటీ ముగిసింది. ఇందులో ప్ర‌ధానంగా బాల‌య్య పీఏ శేఖ‌ర్ విష‌య‌మై హిందూపురం టీడీపీలో నేత‌ల్లో తలెత్తిన గొడ‌వ‌లు, ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా బాల‌కృష్ణ తీయ‌నున్న సినిమా విషయంపైన చ‌ర్చించారు. ఈ భేటీలో టీడీపీ యువ‌నేత నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తీయ‌నున్న సినిమాపై ప‌రిశోధ‌న జరుగుతున్న వైనంపైన, సినిమాలో రాజ‌కీయ అంశాల ప్ర‌స్తావ‌నపైన చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ... హిందూపురం అభివృద్ధికి బాల‌కృష్ణ కృషి చేస్తున్నార‌ని అన్నారు. ఆ నియోజ‌క వ‌ర్గంలో వివాదాలు రావ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జా సంక్షేమానికే బాల‌కృష్ణ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయ‌న అన్నారు.

More Telugu News