: ఆ తర్వాతే ‘తలాక్’పై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర మంత్రి!

ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాతే ‘తలాక్’పై ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేత, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తలాక్’ వ్యవస్థ ముస్లిం మహిళల గౌరవానికి విలువ ఇవ్వడం లేదని, దానిని రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో దుశ్చేష్టలకు ముగింపు పలికేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ‘తలాక్’ అనేది ఒక మహిళ గౌరవానికి సంబంధించిన విషయమని, తలాక్ వ్యవస్థ ముస్లిం మహిళల గౌరవానికి విలువ ఇవ్వడం లేదని, ఈ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు.

More Telugu News