trump: డొనాల్డ్ ట్రంప్ నినాదం నిజమవుతోంది... భారీగా పెరిగిన ఉద్యోగాలు

'ఫర్ అమెరికన్స్, హైర్ అమెరికన్స్' నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విజ‌యం సాధించిన‌ డొనాల్డ్ ట్రంప్ ఎఫెక్ట్ తో ఆ దేశంలో కొత్త‌ ఉద్యోగాల నియామ‌కాలు భారీగా జ‌రుగుతున్నాయి. ఈ ఏడాది ఒక్క‌ జనవరి నెలలోనే అమెరికాలోని ప‌లు వాణిజ్య, ఇతర సంస్థలు కొత్తగా 2 లక్షల 27 వేల కొత్త ఉద్యోగాలను జోడించాయి. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ నివేదిక ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను తెలుపుతూ... చిల్లర వ్యాపారం, నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాల్లో ఈ ఉద్యోగాలు కొత్తగా వ‌చ్చాయ‌ని పేర్కొంది.

గత ఏడాది డిసెంబరులో 1,57,000 ఉద్యోగాలతో పోలిస్తే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఉద్యోగాలు భారీగా పెరిగినట్టు చెప్పింది. అలాగే 4.8 శాతం నిరుద్యోగ రేటుతో, త‌మ దేశంలో 7.6  మిలియన్ల నిరుద్యోగులు ఉన్నట్టు తెలిపింది. మ‌రోవైపు, ఒబామా హ‌యాంలో పెరిగిన ఉద్యోగాల నియామ‌కాల పెరుగుద‌ల‌ను గురించి తెలుపుతూ.. జ‌నవరి 2009-17 మధ్య 11.25 మిలియన్ ఉద్యోగాల పెరుగుదల నమోదైనట్టు తెలిపింది.  

More Telugu News