: బాక్సింగ్ మీద దృష్టి పెట్టిన టెన్నిస్ బ్యూటీ!

సాధారణంగా ఓ స్థాయికి చేరిన క్రీడాకారులపై నిషేధం వేటు పడితే తిరిగి కోలుకునే అవకాశాలు తక్కువగా వుంటాయి. అలా నిషేధానికి గురైన ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడితో నిరాశ, నిస్పృహలకు లోనై వ్యసనాల బారినపడి కెరీర్ ను సర్వనాశనం చేసుకుంటారు. కానీ టెన్నిస్ బ్యూటీ మారియా షరపోవా మాత్రం విభిన్నం. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటున్న షరపోవా, ఈ రెండేళ్ల కాలాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతూనే, మరోపక్క పుస్తకం రాస్తోంది. మరో వైపు బాక్సింగ్‌ కూడా నేర్చుకొంటోంది.

2016 ఆస్ట్రేలియా ఓపెన్‌ సందర్భంగా మెల్డోనియం అనే నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో షరపోవాపై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సహేతుక కారణాల వల్ల నిషేధాన్ని 15 నెలలకు తగ్గించడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 26 నుంచి జరిగే స్టట్‌ గర్ట్‌ క్లేకోర్టు టోర్నీ ద్వారా ఆమె తిరిగి అరంగేట్రం చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఫిట్ నెస్ కాపాడుకునేందుకు, ఒత్తిడిని జయించేందుకు షరపోవా బాక్సింగ్ బాటపట్టింది. తాను రాస్తున్న పుస్తకం త్వరలోనే పూర్తవుతుందని, ఈ పుస్తకం తొలుత ఇంగ్లిష్, తరువాత రష్యన్ భాషలోకి తర్జుమా అవుతుందని షరపోవా తెలిపింది. 

More Telugu News