: అహ్మద్ మృతి విషయం కేంద్ర పెద్దలకు ముందే తెలుసు.. కానీ, దాచి పెట్టారు: మండిపడుతున్న విపక్షాలు

ఓ వైపు సిట్టింగ్ ఎంపీ మరణించి ఉంటే... మరోవైపు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. సహచర ఎంపీ మరణించి ఉండగా... సభను నిర్వహించడం సంప్రదాయాలకు విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సభలో గుండెపోటుకు గురైన ఎంపీ అహ్మద్ (కేరళ) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున చనిపోయారని... ఈ విషయాన్ని ఉదయం 9 గంటలకు అధికారికంగా ప్రకటించారని... ఈ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు.

అహ్మద్ చనిపోయిన విషయం కేంద్రంలోని పెద్దలకు ముందే తెలుసని... కానీ, ఉద్దేశపూర్వకంగానే మరణవార్త ప్రకటనను ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఎలాగైనా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టాలనేదే బీజేపీ పన్నాగం అని అన్నారు. ఒక సీనియర్ సభ్యుడు మరణించిన సందర్భంగా సభను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర నిర్ణయంపై జేడీయూ కూడా మండిపడింది. ఎంపీ మరణానికి సంతాపంగా కేంద్ర బడ్జెట్ ను రేపటికి వాయిదా వేయాలని కోరింది.

More Telugu News