: ద్రోహం చేసిన వారే ఇత‌రుల‌ను ఇప్పుడు ద్రోహులు అంటున్నారు: ప్రత్యేక హోదాపై వెంక‌య్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి పెట్టుబడులు రావడం లేదని, ఉద్యోగాలు రావ‌ని, ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు అస‌త్య‌ప్ర‌చారం చేస్తున్నాయ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై కేంద్ర సర్కారుకి ప్ర‌త్యేక దృష్టి ఉంద‌ని చెప్పారు. రాష్ట్రానికి ఆనాడు ద్రోహం చేసిన వారే ఇప్పుడు ఇత‌రుల‌ను ద్రోహులు అంటున్నారని ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌దేళ్లుగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కాంగ్రెస్‌ చేసింది ఏమిటని ఆయ‌న ప్ర‌శ్నించారు.

అప్ప‌ట్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌ను మాత్ర‌మే పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ మిగ‌తా అన్ని ప్రాంతాల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని, అందుకే ఇప్పుడు ఏపీలో ఈ ప‌రిస్థితి ఉంద‌ని, తాము రోడ్లు, ఐఐటీల వంటి ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నామ‌ని వెంకయ్య అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి పోల‌వ‌రం ప్రాజెక్టు ఒక వ‌ర‌మ‌ని, ఆ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్న విషయం స్ప‌ష్టంగా క‌నప‌డుతోంది క‌దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. విద్య, వైద్య సంస్థ‌లు వ‌స్తున్నాయ‌ని అన్నారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వం ఏ రాష్ట్రానికి చేయ‌నంత సాయం ఏపీకి చేస్తోంద‌ని చెప్పారు.

More Telugu News