kajal: మెగాస్టార్ చిరంజీవి స‌ర్ చాలా అందంగా ఉంటారు: ‘చిరు’ని అభివ‌ర్ణించిన కాజ‌ల్

‘మెగాస్టార్ చిరంజీవి స‌ర్ చాలా అందంగా ఉంటారు.. చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు.. ఎంతో నిబ‌ద్ధ‌త‌తో, చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తార‌ు’ అని చిరుని హీరోయిన్ కాజ‌ల్ పొగడ్తలలో ముంచెత్తింది. ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ఖైదీ నంబ‌ర్‌ 150 సినిమాలోని 'అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు' పాట‌లో చిరు, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి ఒకేసారి డ్యాన్స్ వేయ‌డం ఎంతో మంచి అనుభ‌వాన్ని ఇచ్చిందని ఆమె చెప్పింది. త‌న‌ ఫేవ‌రెట్ హీరో చిరంజీవి అని పేర్కొంది. త‌న పెళ్లి ఎప్పుడ‌నే విష‌యాన్ని మాత్రం కాజ‌ల్ చెప్ప‌లేదు. ఇక‌ అల్లు అర్జున్‌కి ఎంతో ఎన‌ర్జీ ఉంటుంద‌ని తెలిపింది. ఇప్పుడున్న హీరోయిన్స్‌ల‌లో ఎవ‌రూ ఎవ‌రికీ పోటీ కాదని ఆమె తెలిపింది.

త‌న‌కు తానే కాంపిటేష‌న్‌గా భావిస్తాన‌ని, ఇంత‌కు ముందు న‌టించిన సినిమా క‌న్నా మంచిగా న‌టించాల‌ని ఎప్పటికప్పుడు అనుకుంటాన‌ని కాజల్ అంది. హార్డ్ వ‌ర్క్ చేయ‌డ‌మే త‌న స‌క్సెస్ సీక్రెట్ అని చెప్పింది. త‌న గ్లామ‌ర్ సీక్రెట్ ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడు హాయిగా నిద్ర‌పోవ‌డ‌మేన‌ని తెలిపింది. శాత‌కర్ణి, చిరు ఖైదీ.. రెండు సినిమాలూ హిట్ అయినందుకు హ్యాపీగా ఉందని పేర్కొంది.

More Telugu News