: నగదు వాడకంపై మరిన్ని ఆంక్షలు విధించనున్న కేంద్ర ప్రభుత్వం!

పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం నగదు విత్ డ్రాయల్స్ పై పలు ఆంక్షలను విధించిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడు నగదు లావాదేవీలపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటి దాకా రూ.50 వేల నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ. 30 వేలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. రూ. 30 వేలకు మించి కొనుగోళ్లు జరిపితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, నిర్దేశించిన పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిపితే, వాటికి ఛార్జీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. లక్ష రూపాయలకు మించి లావాదేవీలు జరిపితే ఈ-ఛార్జీలు వేయనుందట. 

More Telugu News