: సినిమా తీసేందుకు డబ్బుల కోసం.. ఇండోర్-పాట్నా ఎక్స్ ప్రెస్ కింద బాంబులు పెట్టి 151 మందిని చంపారు!

గత సంవత్సరం కాన్పూర్ సమీపంలో  ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్, అజ్మీర్ - సీల్దా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనల్లో పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ప్రమేయం ఉందని, వారిచ్చిన డబ్బు తీసుకునే తాము పట్టాల కింద కుక్కర్ బాంబులను పెట్టామని పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మావోయిస్టు మోతీలాల్ పాశ్వాన్, ఉమాశంకర్ పటేల్, ముకేశ్ యాదవ్ లు అంగీకరించారు. తాము ఓ భోజ్ పురి చిత్రాన్ని తీసేందుకు నగదు ఇచ్చేందుకు ఐఎస్ఐ ఏజంట్ బ్రిజ్ చెప్పాడని, రైళ్లు పట్టాలు తప్పేలా చేసి భారీ ఎత్తున ప్రాణనష్టాన్ని కలిగిస్తే, నగదు, వాహనాలు కూడా ఇస్తామని ఆశ పెట్టారని నిందితులు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పగా, 151 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంత దారుణానికి పాల్పడినందుకు నేపాల్ కు చెందిన బ్రిజ్ నుంచి రూ. 3 లక్షలు తీసుకున్నట్టు అంగీకరించారు. నిందితులపై ఇప్పటికే క్రిమినల్ కేసులున్నాయని, బాంబులు అమర్చింది మోతీలాల్ అని ఓ అధికారి పేర్కొన్నారు.

More Telugu News