: పారిస్ చుట్టుపక్కల ముస్లింల 'వహాబిజం' అమలుకు తీవ్ర ప్రయత్నాలు...ఇస్లామిక్ తీవ్రవాదం పుంజుకుంటోందా?

ఇరాక్, సిరియాల నుంచి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను సంకీర్ణ సేనలు తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సరైన స్థావరం కోసం వేటలో ఉన్నారు. ఈ క్రమంలో ముస్లిం ప్రాబల్యం అధికంగా గల వివిధ దేశాల్లో షరియా చట్టం అమలు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాషన్ ప్రపంచానికి కేంద్ర బిందువైన ఫ్రాన్స్ రాజధాని పారిస్ చుట్టుపక్కల షరియా చట్టం అమలు చేస్తూ సరికొత్త రాజ్యస్థాపనకు బీజం వేస్తున్నారని అక్కడి మహిళా హక్కుల సంఘాలు చెబుతున్నాయి. పారిస్ కు 16 కిలోమీటర్ల దూరంలో సేవ్రాన్ అనే పట్టణం ఉంది. అందులో సుమారు 14 లక్షల జనాభా ఉంది. వారిలో 6 లక్షల మంది ముస్లిం సమాజానికి చెందిన వారు. దీంతో ఇక్కడ ముస్లింల జీవన శైలి ఇతర ఫ్రెంచ్ సమాజానికి భిన్నంగా ఉందని, సమాంతరంగా ముస్లిం సమాజాలను నడుపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ముస్లిం మహిళలపై ఆంక్షలను పురుషులు సమర్థిస్తున్నారని, ముస్లిం సమాజం విధించిన కట్టుబాట్లను దాటితే తీవ్రమైన శిక్షలు కూడా అమలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ఫ్రాన్స్ లోని మసీదులకు ఖతార్ నుంచి భారీ ఎత్తున నిధులు అందుతున్నాయని, వాటితో ఇస్లామీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. వహాబిజమ్ ను వ్యాప్తి చేయాలని ఖతార్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, వహాబిజమ్ అంటే ఇస్లాంలో రాడికల్ రూపమేనని వారు చెబుతున్నారు. మరోవైపు పారిస్ దాడుల తీవ్రవాదులు ఐఎస్ఐఎస్ ప్రతినిధులన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎస్ఐఎస్ పారిస్ సమీపంలో మళ్లీ ఊపిరిలూదుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News