: ఒబామా ఆదేశాల రద్దు, చట్టవ్యతిరేకంగా ఉంటున్న వారి గెంటివేత... ట్రంప్ తొలిరోజు ప్లాన్!

మరో వారంలో అమెరికాకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్, తొలిరోజే ఒబామా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పారిశ్రామిక నియంత్రణపై ఒబామా నిర్ణయాలను రద్దు చేయాలని, చట్ట వ్యతిరేకంగా, ఎటువంటి డాక్యుమెంట్లూ లేకుండా దేశంలో తిష్ట వేసుకుని కూర్చున్న వారిని గెంటివేయాలని, మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలన్న తన దైన మార్క్ పాలనను చూపేలా తొలి రోజు ఆయన్నుంచి ఆదేశాలు రానున్నట్టు సమాచారం.

ఒక్క సంతకంతో కొన్ని ఆదేశాలను రద్దు చేస్తూ, మరికొన్నింటిని సమీక్షిస్తూ, ఇంకొన్ని విధానాలను పాక్షికంగా మారుస్తూ, ట్రంప్ నిర్ణయాలు ఉంటాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. "ఆయన కేవలం బాధ్యతలు స్వీకరించి చూస్తూ కూర్చోరు. తొలిరోజునే తాను అనుకున్న పనులను చేయడం ప్రారంభిస్తారు" అని ఇమిగ్రేషన్ అటార్నీ డేవిడ్ లియోపోల్డ్ వ్యాఖ్యానించారు. హెల్త్ కేర్ విభాగంపైనా ఆయన ప్రత్యేక దృష్టిని సారించనున్నారని తెలిపారు.

More Telugu News