trump: ర‌ష్యాలో డొనాల్డ్ ట్రంప్ బాగోతంపై అమెరికాలో సంచ‌ల‌న క‌థ‌నం!

ర‌ష్యాలో డొనాల్డ్ ట్రంప్ జ‌రిపిన‌ బాగోతంపై అమెరికా ఇంట‌ర్నెట్ కంపెనీ బ‌జ్‌ఫీడ్ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇప్పుడు ఈ అంశమే అమెరికాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త స‌మాచారం ర‌ష్యా వ‌ద్ద ఉంద‌ని ఇటీవ‌లే అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ఆ ప‌త్రిక స‌మ‌గ్రంగా ప్ర‌చురించింది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలోని హోట‌ల్‌లో గ‌తంలో ట్రంప్ సాగించిన అశ్లీల ప‌ర్వం గురించి పేర్కొంది. ట్రంప్ పాటించిన‌ శృంగార జీవితాన్ని ఇప్పుడు ర‌ష్యా ఫాలో అవుతున్న‌ట్లు కూడా తెలిపింది.

ట్రంప్ శృంగారం తీరుపై ర‌ష్యా ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు రూపొందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఆ నివేదిక‌ల్లో పేర్కొన్న అంశాలను గురించి ప్ర‌సావిస్తూ ట్రంప్ మిస్ యూనివ‌ర్స్‌ పోటీల కోసం మాస్కో వెళ్లి రిట్జ్ కార్ల‌ట‌న్ హోట‌ల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారని, ఆ రూమ్‌లో ట్రంప్ వికృత శృంగార చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డార‌ని, ఇందుకు సంబంధించిన వివ‌రాలు, ఆధారాలు ర‌ష్యా ద‌గ్గ‌ర‌ ఉన్నాయని పేర్కొంది. ట్రంప్ ఆ రూమ్‌లో వ్య‌భిచారుల‌తో అస‌భ్య‌క‌ర శృంగార చేష్ట‌లు చేయించిన‌ట్లు పేర్కొంది. గ‌తంలో ఇదే రూమ్‌లో ఒబామా దంప‌తులు బ‌స చేశారు.

More Telugu News