nagarjuna: చాలా రోజుల త‌రువాత బాల‌య్యపై స్పందించిన నాగార్జున‌!

బాల‌కృష్ణ 100వ సినిమాగా తెరకెక్కిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకి అద్భుత స్పంద‌న వ‌స్తుండ‌డంతో ఇండస్ట్రీకి చెందిన ప‌లువురు ప్రముఖులు ఈ సినిమాపై త‌మ త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. అయితే, బాల‌య్య‌కు అభినంద‌న‌లు తెలిపిన వారిలో అక్కినేని నాగార్జున కూడా ఉండ‌డం విశేషం. ఎన్నో రోజులుగా బాల‌కృష్ణ‌కు దూరంగా ఉంటూ వస్తున్న నాగ్ సైతం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంపై స్పందించాడు. బాలయ్య, క్రిష్‌తో పాటు ఆ చిత్రం బృందానికి ఆల్‌ ది బెస్ట్ తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాడు. త‌న‌కు ఇటువంటి హిస్టారికల్‌ సినిమాలంటే ఎంతో ఇష్టమ‌ని, అందుకే ఈ సినిమా కూడా హిస్టరీ క్రియేట్‌ చేయాలని తాను కోరుకుంటున్నానని ఆయ‌న ట్వీట్ చేశాడు.

More Telugu News