: 2015 తర్వాత పుట్టినవారు ఇకపై ఆ దేశంలో సిగ‌రెట్ ముట్టుకోలేరు!

ఆరోగ్యాన్ని పాడుచేసే సిగ‌రెట్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని రష్యా కీల‌క నిర్ణ‌యం తీసుకుని ముందుకు వెళుతోంది. 2033 నుంచి ఈ నిర్ణ‌యం అమల్లోకి రానుంది. సామాన్యంగా యువ‌త‌ 18 ఏళ్లు నిండాక సిగ‌రెట్‌కు అల‌వాటు ప‌డ‌తారు. అయితే, 2015 తర్వాత పుట్టిన వారికి సిగరెటలు విక్రయాలు చేపట్టకుంటా రద్దు చేస్తున్నట్టు ఆ దేశ ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ మేర‌కు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్ర‌తిపాద‌న‌కు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

దీంతో పొగాకును పూర్తిగా రద్దు చేస్తున్న తొలి దేశంగా రష్యా నిల‌వ‌నుంది. త‌మ‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చే‌సిన ఈ ప్ర‌తిపాద‌న‌ లక్ష్యం సిద్ధాంతపరంగా సరైనదని రష్యా పార్లమెంట్ హెల్త్ కమిటీ సభ్యుడు నికోలాయ్ గెరాసిమెన్కో తెలిపారు. తాము ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి వివిధ పెడరల్ ఏజెన్సీలతో పాటు ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు పంపామని పేర్కొన్నారు. గ‌త ఏడాది రష్యాలో పొగ‌తాగే వారి సంఖ్య‌ 10 శాతం త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.  

More Telugu News