: అల్లుడికి కీలక పదవి కట్టబెట్టిన ట్రంప్!

అమెరికా నూతన అధ్యక్షుడిగా పదవీబాధ్యతలను స్వీకరించబోతున్న డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో అడుగు వేశారు. తన సొంత అల్లుడు జారెద్ కుష్నర్ కు కీలక పదవిని కట్టబెట్టారు. తనకు సీనియర్ సలహాదారుగా కుష్నర్ ను నియమించారు. మిడిల్ ఈస్ట్, వాణిజ్యం వ్యవహారాల్లో తనకు సలహాలు ఇచ్చే బాధ్యతను కుష్నర్ కు అప్పగించారు. ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన ఆమోదం లభించిన వెంటనే సలహాదారుగా కుష్నర్ పదవిని చేపడతారు.

కుష్నర్ వయసు 35 ఏళ్లు. ట్రంప్ కుమార్తె ఇవాంకాను కుష్నర్ పెళ్లాడారు. న్యూయార్క్ లో రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. తన పదవి నేపథ్యంలో న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ కు షిఫ్ట్ అయ్యేందుకు కుష్నర్ సన్నాహకాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, కుష్నర్ తనకు లభించిన అద్భుతమైన ఆస్తి అని... అధికార బదిలీ ప్రక్రియలో నమ్మకమైన సలహాదారుగా నిలిచారని కొనియాడారు. 

More Telugu News