: ఒబామా తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయం ఇదేనట!

తన పరిపాలనలో తాను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమేంటో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. 2009లో ఆఫ్ఘనిస్థాన్ కు మరో 30 వేల మంది సైనికులను పంపాలని తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదని చెప్పారు. అప్పటికే ఆఫ్ఘాన్ లో చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని... మెజారిటీ ఉన్నతాధికారులు, సైనికులు 'క్విట్ ఆఫ్ఘాన్' అంటూ నినదిస్తున్నారని... అలాంటి సమయంలో తాను ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

తాను తీసుకున్న నిర్ణయం బాధాకరమైనా, ఉగ్రవాదంపై పోరులో వెనుకడుగు వేయరాదనేదే తన అభిమతమని చెప్పారు. సైన్యాన్ని అమెరికా వెనక్కి పిలిపించుకుంటే, ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు మళ్లీ బలం పుంజుకునేవారని తెలిపారు. ఉగ్రమూకలకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే... అక్కడ ఇంకా సైన్యాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.

More Telugu News