: ముఖ్యమంత్రి చంద్రబాబు ఊర్లో ఒక్క బ్యాంకు కూడా లేదు!

నిత్యమూ నగదు రహిత, డిజిటల్ లావాదేవీలు పెరగాలని చెబుతుండే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సొంత ఊరు చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఒక్క బ్యాంకు శాఖ కూడా లేదు. వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజం! బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు తాము పక్క ఊరికి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందిగా ఉంటోందని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. నారావారిపల్లెలో 40 అగ్రకులాల ఇళ్లు సహా 90 కుటుంబాల వరకూ ఉన్నాయి. పక్కనే ఉన్న ఎ.రంగం పేటలో సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఇంకాస్త దూరంలో ఆంధ్రా బ్యాంకు శాఖలు ఉన్నాయి. నారావారిపల్లె ప్రజలు ఎవరైనా ఈ బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు జరుపుకోవాల్సిన పరిస్థితి వుంది. తమ గ్రామంలోనూ ఓ బ్యాంకును ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

More Telugu News