clg: అమ్మాయిలపై దాడుల నేపథ్యంలో కొత్తచట్టం.. కళాశాలల క్యాంపస్‌లలోకి అపరిచితులు ప్రవేశిస్తే నేరుగా జైలుకే!

బెంగళూరులో యువతులపై జరుగుతున్న దాడుల పట్ల దేశం యావత్తు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డిగ్రీ కళాశాలలో చదివే యువతులకు పూర్తిగా రక్షణ కల్పించే ఉద్దేశంతో తాము త‌మ రాష్ట్రంలోని క‌ళాశాల‌ల్లో ఓ కొత్త చట్టాన్ని తీసుకురానున్న‌ట్లు క‌ర్ణాట‌క‌ విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌ నాగభూషణం తెలిపారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం అనుమతి లేకుండా కళాశాల క్యాంపస్‌లలోకి అపరిచితులు ప్రవేశిస్తే వారిని జైలుకు పంపిస్తార‌ని తెలిపారు. క‌ళాశాల‌ల్లో ప్రిన్సిపాల్‌ అనుమతి లేకుండా ఎవరూ క్యాంపస్‌లోకి వెళ్లడానికి వీలు లేద‌ని చెప్పారు.

దీని కోసం అన్ని క్యాంపస్‌ల‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామ‌ని అజయ్‌ నాగభూషణం తెలిపారు. ఇక‌ ప్రభుత్వ కళాశాలలకు ప్రహరీ గోడ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, త‌మ‌ రాష్ట్రంలోని 411 ప్రభుత్వ కళాశాలల్లో 3లక్షల మంది విద్యార్థులు ఉండగా, వారిలో 2 లక్షల మంది బాలికలే ఉన్నారని తెలిపారు. అన్ని క‌ళాశాల‌లు పాటించాల్సిన‌ పలు మార్గదర్శకాలపై సూచనలు చేశామని చెప్పారు. 

More Telugu News