: అట్లాంటిదేమీ లేదు... అసలు సాక్ష్యమెక్కడ?: బెంగళూరు సామూహిక వేధింపులపై కొత్త పోలీస్ బాస్

బెంగళూరు ఎంజీ రోడ్డులో కొత్త సంవత్సరం ప్రవేశించిన వేళ, మహిళలపై జరిగిన సామూహిక వేధింపులపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, బెంగళూరు నగర కొత్త పోలీస్ బాస్ ప్రవీణ్ సూద్ కొత్త భాష్యం చెప్పారు. ఆరోపణలు వస్తున్నట్టుగా ఎంజీ రోడ్డులో అట్లాంటిదేమీ జరగలేదని అన్నారు. దాదాపు కోటి మంది నివసిస్తున్న నగరంలో మహిళలపై వేధింపులు జరిగే అవకాశాలు ఉన్నా, అందుకు సాక్ష్యాలు లేవని చెప్పారు.

'సామూహిక వేధింపులు' అన్న పదం వాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన, ఏదైనా జరిగితే దాన్ని 'అపచారం' అంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు. "డిసెంబర్ 31 రాత్రి పోలీసులు అక్కడ ఉన్నారు. 20కి పైగా మీడియా ఓబీ వ్యాన్ లు ఉన్నాయి. కానీ ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. ఇవాళ, రేపు ఏ చిన్న ఘటన జరిగినా నిమిషాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరులో జరిగినట్టు చెబుతున్న ఘటనలపై ఫిర్యాదులు లేవు" అన్నారు. వేధింపులను ఎదుర్కొన్న యువతులు తమ వద్దకు రావాలని కోరారు. కేవలం 30 సెకన్ల వీడియో ఫుటేజ్ చూసి చర్యలు తీసుకోలేమని, అందుకు ముందు, తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాల్సి వుందని చెప్పారు.

More Telugu News