demonitisation: నల్లధనాన్ని ఎంతో తెలివిగా నాశనం చేసే చర్య ఇది : పెద్ద‌నోట్ల ర‌ద్దుపై దువ్వూరి సుబ్బారావు

హైదరాబాద్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై స్పందించారు. భార‌త్‌లో 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత కేంద్ర స‌ర్కారు తీసుకున్న ఓ గొప్ప చ‌ర్య ఇది అని ఆయన అన్నారు. దేశంలో నల్లధనం నిరోధానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలోని క‌రెన్సీలో 86 శాతం ఉన్న పెద్ద‌నోట్ల‌ను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారని ఆయ‌న అన్నారు. ఇది ఎంతో ప్రత్యేకమైన చ‌ర్య అని వ్యాఖ్యానించారు. దీనిని ప్రత్యేక సృజనాత్మకతతో కూడిన విధ్వంస చర్యగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌... నల్లధనాన్ని ఎంతో తెలివిగా నాశనం చేయడమే ఈ చ‌ర్య ఉద్దేశ‌మ‌ని చెప్పారు.

More Telugu News