: చేత్తో ఒక్క రూపాయి ఇచ్చినా అనర్హతే... ఈసీ కీలక నిర్ణయం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చునూ నమోదు చేయాలని, దాన్ని నిత్యమూ అధికారులకు అందించాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఒక్క రూపాయి కూడా నగదు ఖర్చును అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. తమకు ఫిర్యాదులు వస్తే, కఠినంగా వ్యవహరిస్తామని, విచారణలో తప్పు చేసినట్టు తేలితే, అభ్యర్థిపై అనర్హత వేటు సహా అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని తెలిపింది.

ప్రతి అభ్యర్థీ విధిగా ఎన్నికల ఖాతాను ప్రారంభించాలని, దాన్నుంచే కేటాయింపులు జరపాలని ఆదేశించింది. సదరు ఖాతాలోని వివరాలన్నీ ఈసీకి అందించాలని, ఒకవేళ బ్యాంకుల ద్వారా కాకుండా చెల్లింపులు జరపాల్సి వస్తే, చెక్కులు జారీ చేయాలని సూచించింది. రూ. 20 వేల కన్నా అధిక మొత్తంలో డొనేషన్లు వస్తే, అది చెక్కులు లేదా డీడీల రూపంలో మాత్రమే ఉండాలని పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ ఖర్చులపై పూర్తి వివరాలతో కూడిన డిక్లరేషన్ ను ఎన్నికలు ముగిసిన 30 రోజుల్లోగా ప్రకటించాలని ఆదేశించింది.

More Telugu News