: బాబు సర్కారుకు 48 గంటల డెడ్ లైన్ విధించిన పవన్ కల్యాణ్

"రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులతో ఓ కమిటీని వేసి, ఈ ఉద్దానం సమస్యను గుర్తించి, ఇక్కడ జబ్బున బారినపడ్డ వ్యక్తులను ఆర్థికంగా... అలాగే వైద్య పరంగా ఎట్లా ఆదుకుంటారన్న విషయాన్ని వెంటనే చెప్పాలి" అని పవన్ కల్యాణ్ చంద్రబాబును డిమాండ్ చేశారు.

"వీటన్నింటిపైనా కమిటీ వేసి వచ్చే 48 గంటల్లో ప్రజలకు వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తరువాత... మా జనసేన పార్టీ నివేదికను సబ్ మిట్ చేసిన తరువాత, ఆప్పటికీ మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లని పక్షంలో ప్రజా ఉద్యమంగా సాగుతాం. నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అందుకు ఇక్కడి ప్రజలతో పాటు జనసేన కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి. మీ అందరి సహకారంతో, దీన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. మీరందరూ కూడా మన కమిటీతో పనిచేయాలని కోరుకుంటున్నా" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

More Telugu News