: 20 ఏళ్లుగా వ్యాధి ఉన్నా కారణం కూడా కనుక్కోకుండా వదిలేస్తారా?: పవన్ ఆగ్రహం

"ఈ ఉద్దానం కిడ్నీ సమస్య, గత 20 సంవత్సరాలుగా దృష్టిలో ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల దృష్టిలోకి రావడానికి సమయం పట్టింది. కాకపోతే, దీన్ని ఇలాగే వదిలేస్తే... నాకు బాధ కలిగించింది ఏమిటంటే... రాబోయే తరాల్లో చిన్నపిల్లలు కూడా దీని బారిన పడనున్నారని తెలియడం నన్ను కలచివేసింది. ఈ సమస్యను గుర్తించి ఇంత దూరం రావడానికి వెనుక, రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయవేత్తలైనా ఉన్నది సమాజంలో సమస్యలను సరిదిద్దడానికే, ఏదో లబ్ది పొందేందుకు కాదు" అని కిడ్నీ బాధితులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

"కానీ, ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నా, ఎందుకు సరైన విధానంలో గుర్తించి, సరైన పరిష్కారాన్ని ఎందుకు కనుగొనలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. గత ప్రభుత్వాలు చేసింది ఏమిటన్న దానికన్నా, ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం... ఫ్యూచర్ లో, రాబోయే కాలంలో ప్రజలు, చిన్న పిల్లలు దీని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతోనే ఇటు వచ్చాను. సమస్యను దేశం దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకు వెళ్లడానికి కృషి చేస్తాను" అన్నారు పవన్ కల్యాణ్.

More Telugu News