: ఆ దేశ అణ్వస్త్రాలు మమ్మల్ని ఏమీ చేయలేవ్: ఉత్తర కొరియా హెచ్చరికలను 'లైట్' తీసుకున్న ట్రంప్

చైనా, ఉత్తర కొరియాలపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. పక్షపాత వాణిజ్య విధానాలను అనుసరిస్తూ, అమెరికాను చైనా నిలువునా దోచుకుంటోందని మండిపడ్డారు. మరోపక్క, తమ ఖండాంతర క్షిపణులతో అమెరికాను నాశనం చేస్తామని హెచ్చరించిన ఉత్తర కొరియాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియా మిస్సైళ్లకు అమెరికాపై దాడి చేసేంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. అణ్వస్త్ర దేశంగా తమను గుర్తించాలని ఉత్తర కొరియా చేసిన డిమాండ్ ను ట్రంప్ కొట్టి పడేశారు. అది ఎన్నటికీ జరగదని అన్నారు. సరైన విధానాలతోనే ఈ రెండు దేశాలకు సమాధానం చెబుతామని తెలిపారు. చైనాతో వాణిజ్యం, ఉత్తర కొరియా అణు హెచ్చరికల నేపథ్యంలో, ట్విట్టర్ వేదికగా ట్రంప్ స్పందించారు. 

More Telugu News