: అమ‌రావ‌తిలో ఉద్యోగాల్లో అంద‌రికీ ప్రాధాన్యం.. రాజ‌ధాని ఫ్రీ జోన్‌.. ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ఫ్రీ జోన్ చేస్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి  ప‌రిధిలోని ఉద్యోగ నియామకాల్లో రాయ‌ల‌సీమ‌, ద‌క్షిణ కోస్తా, ఉత్త‌రాంధ్ర ప్రాంత  ప్ర‌జ‌ల‌కు స‌మాన అవ‌కాశాలు ఉంటాయ‌ని పేర్కొన్నారు. శ్రీశైలం ఎగువ‌న నిర్మించిన ముచ్చుమ‌ర్రు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రాజెక్టును సోమ‌వారం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. అనంత‌రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ అమ‌రావ‌తిని ఫ్రీ జోన్‌గా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో రాయ‌ల‌సీమ యువ‌త‌కు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని అన్నారు. ఇక్క‌డ అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు స‌మాన‌స్థాయిలో ఉద్యోగాలు ల‌భిస్తాయ‌న్నారు. రాష్ట్రానికి పోల‌వరం ప్రాజెక్టు జీవ‌నాడి అయితే ముచ్చుమర్రు రాయ‌ల‌సీమ ప్రాణ‌నాడి అని అభివ‌ర్ణించారు. ఎన్టీఆర్ పునాదిరాయి వేసిన ప్రాజెక్టుల‌ను తాను ప్రారంభించ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు.

More Telugu News