: కొత్త సంవత్సరం వచ్చింది, నగదు కష్టం అలాగే ఉంది!

నూతన సంవత్సరంలోనూ కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నగదు కోసం ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. హైదరాబాద్ లో 80 శాతానికి పైగా ఏటీఎంలు తెరచుకోలేదు. మొత్తం ఏటీఎంలలో సగానికి పైగా ఏటీఎంలు గత 50 రోజులుగా మూతపడే ఉండగా, కొన్నింటిలో అప్పుడప్పుడూ బ్యాంకులు నగదు నింపుతూ వచ్చాయి. ఇక కొత్త సంవత్సరం తొలి రోజు ఆదివారం కావడంతో నగదు కోసం ప్రజలు ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, చాలా చోట్ల మాత్రం నగదు లేని ఏటీఎంలే ప్రజలను వెక్కిరిస్తున్నాయి.

More Telugu News