kodandaram: ఇంట్లోనే దీక్ష‌కు దిగిన ప్రొ.కోదండ‌రాం.. ఉద్రిక్త‌త‌

తెలంగాణ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోన్న భూసేక‌ర‌ణ విధానానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాం ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. ఇందుకోసం అనుమ‌తి తీసుకోవ‌డానికి నిన్న పోలీసుల‌కి విన‌తి ప‌త్రాన్ని కూడా స‌మ‌ర్పించారు. అయితే, ఆయ‌న ధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అలాగే ధ‌ర్నాలో పాల్గొన‌డానికి ప‌లు జిల్లాల నుంచి త‌ర‌లివ‌స్తున్న టీజేఏసీ నేత‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేశారు.

దీంతో ఆగ్ర‌హించిన కోదండ‌రాం ఈ రోజు త‌న ఇంట్లోనే దీక్ష‌కు దిగారు. శాంతియుతంగా చేయ‌త‌ల‌పెట్టిన ధ‌ర్నాను అడ్డుకోవ‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద ఉద్రిక్తత నెల‌కొంది. భారీగా పోలీసులు మోహ‌రించారు. ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం నాయ‌కులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

More Telugu News