telangana: తెలంగాణలో తగ్గనున్న సెల్ ఫోన్ ధరలు... వ్యాట్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. స‌భ‌లో ఈ రోజు ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్‌) సవరణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం ఈ బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ... నోట్ల రద్దు నేప‌థ్యంలో న‌గ‌దుర‌హిత లావాదేవీల‌ను ప్రోత్సహించడం కోసం సెల్‌ఫోన్లపై వ్యాట్ తగ్గింపు బిల్లును తీసుకొచ్చామ‌ని, మొబైల్ ఫోన్లపై 14.5 శాతం ఉన్న వ్యాట్ 5 శాతానికి తగ్గించామ‌చి చెప్పారు. డిజిట‌లైజేష‌న్‌ అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని త‌మ స‌ర్కారు కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో తెలంగాణలో సెల్‌ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.

More Telugu News