: ఐక్యరాజ్యసమితి సరదా కాలక్షేపానికి క్లబ్ లాంటిది!: ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితిపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరదాగా కాలక్షేపం చేయాలనుకునేవారికి ఐక్యరాజ్యసమితి క్లబ్బులాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలెంలో ఇజ్రాయెల్ పౌరులు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. దీనిపై ఆయన స్పందిస్తూ ట్వీట్ లు చేశారు. ఐక్యరాజ్యసమితికి విస్తృత సామర్థ్యం ఉందని, అయితే అది సరదాగా కాలక్షేపం చేసేవారి క్లబ్బుగా మారిపోయిందని మండిపడ్డారు. ఇది చాలా విచారకరమని చెప్పిన ఆయన, జనవరి 20 తరువాత ఐక్యరాజ్యసమితిలో పరిస్థితులు ఇలా ఉండవని ఆయన అన్నారు. 

More Telugu News