: కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామ్ గోపాల్ వర్మ దిష్టి బొమ్మ దహనం

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రంపై  నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ చిత్రంలో వంగవీటి రంగా కుటుంబీకులను కించపరిచేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రంగా అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ సినిమా ప్రదర్శిస్తున్న లక్ష్మీ థియేటర్ వద్ద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉండగా, రంగా 28వ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పాలాభిషేకం నిర్వహించి, నివాళులర్పించారు. రంగా కుటుంబీకులను కించపరిచేలా ‘వంగవీటి’ సినిమా తీసిన వర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 

More Telugu News