cigarrate blast: బస్సులో ఎలక్ట్రానిక్ సిగరెట్‌ తాగాలనుకున్నాడు.. సిగరెట్ పేలడంతో ఆసుపత్రిలో పడ్డాడు!

ఎలక్ట్రానిక్‌ సిగరెట్ పేలడంతో ఓ వ్య‌క్తికి తీవ్ర‌గాయాల‌యిన ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో ఫెస్నో నగరంలో ఓ పొగ‌రాయుడు త‌న జేబులో ఎల‌క్ట్రానిక్ సిగ‌రెట్‌ను పెట్టుకొని తిరుగుతున్నాడు. అయితే, బస్సులో ఎక్కిన స‌మ‌యంలో ఆ ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ను ఉపయోగించేందుకు య‌త్నించాడు. దీనిని గ‌మ‌నించిన బ‌స్సు డ్రైవ‌ర్ బస్సులో సిగ‌రెట్ తాగ‌కూడ‌ద‌ని చెప్పాడు. దీంతో ఆ ఎల‌క్ట్రానిక్ సిగ‌రెట్‌ను అత‌డు జేబులో పెట్టుకున్నాడు. అంతే, వెంట‌నే పెద్ద శబ్దంతో అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో అత‌డికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం అత‌డికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News