tamota rate falls: బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌లో రెండు ట‌న్నుల ట‌మోటాలను పార‌బోసిన అనంత‌పురం రైతు

నెలల తరబడి ఎంతో శ్రమప‌డి అప్పులు చేసి ట‌మోటాలు పండించిన రైతుల క‌ష్టం వృథాగా పోతోంది. కోటి ఆశ‌ల‌తో మార్కెట్‌కు తీసుకొస్తున్న ట‌మోటాల‌కు స‌రైన ధర దొర‌క‌క‌పోతుండ‌డంతో రైతులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. మార్కెట్ లో ట‌మోటా రైతులకు వ్యాపారులు షాక్ ఇస్తున్నారు. కేజీ టమోటా రేటు గ‌ణ‌నీయంగా త‌గ్గించేసి రైతులతో క‌న్నీరు పెట్టిస్తున్నారు. ఈ రోజు ఉద‌యం సికింద్రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌లో ట‌మాటా ధ‌ర బాగా త‌గ్గిపోయింది. దీంతో తీవ్ర ఆవేద‌న చెందిన అనంత‌పురంకు చెందిన ఓ రైతు 2 ట‌న్నుల ట‌మోటాలను అక్కడే పార‌బోశాడు.

More Telugu News