: రూ.70 కోట్లు ఖాతాల్లో జమ చేశారు... చివరికి రూ.1.4 కోట్లు మిగిల్చారు

పెద్ద నోట్ల రద్దు తర్వాత ముంబైలో రూ.70 కోట్లు జమ అయిన రెండు ప్రైవేటు బ్యాంకు ఖాతాలను అధికారులు జప్తు చేశారు. అనుమానిత షెల్ (బూటకపు) కంపెనీల నుంచి ఇవి వచ్చినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సందేహిస్తున్నారు. అయితే, రూ.70 కోట్లు జమ అయినప్పటికీ అధికారులు ఆ ఖాతాలను జప్తు చేసే సమయానికి వాటిల్లో మిగిలినది కేవలం రూ.1.4 కోట్లే . ఈ ఖాతాలు పట్టణానికి చెందిన ఓ బంగారం వర్తకుడి పేరిట ఉండడంతో అధికారులు అతడ్ని విచారించారు. నిజానికి డీమోనిటైజేషన్ తర్వాత ఈ ఖాతాల్లోకి రూ.100 కోట్ల వరకు జమ కాగా, అందులో రూ.30 కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ అయినవిగా గుర్తించారు. మిగిలిన రూ.70 కోట్లు రద్దయిన పెద్ద నోట్లను జమ చేసినవిగా, బంగారం విక్రయాలతో వచ్చిన ధనంగా అనుమానిస్తున్నారు. 

More Telugu News