duttore comments: గతంలో తాను హంతకుడ్నని ప్రకటించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

'అవును.. నేను హంతకుడ్నే' అని ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటర్టీ ప్రకటించి సంచలనం రేపారు. మనీలాలో ఆయన మాట్లాడుతూ, తాను మేయర్ గా ఉండగా మనుషులను చంపానని అన్నారు. తానే మనుషులను చంపగలిగినప్పుడు మీరెందుకు చంపలేరంటూ రోడ్రిగో పోలీసులను ప్రశ్నించారు. దవావో మేయర్ గా ఉన్నప్పుడు తాను బైక్ వేసుకుని సమస్యల పరిష్కారం కోసం తిరిగేవాడినని అన్నారు. సమస్య ఉత్పన్నమవుతోందంటే చర్యలు తీసుకునేవాడినని చెప్పారు. ఓసారి అలా తిరుగుతున్నప్పుడు ముగ్గురు నేరగాళ్లు ఓ యువతిని కిడ్నాప్ చేసి, రేప్ చేస్తారని అనిపించిందని, వెంటనే ఆ ముగ్గుర్నీ కాల్చిచంపానని తెలిపారు.

2015లో అధికారం చేపట్టిన అనంతరం డ్రగ్ మాఫియాపై యుద్ధం చేపట్టిన రోడ్రిగో ఇప్పటివరకు సుమారు 6 వేల మందిని హత్యచేయించారు. దవావో మేయర్ గా ఉండగా, రోడ్రిగో యుజి మెషీన్ గన్ తో న్యాయశాఖ ఏజెంట్ ను కాల్చిచంపాడని అతని హంతక ముఠా సభ్యుడు సెనేట్ ముందు వాంగ్మూలమిచ్చాడు. 2016లో జరిగిన ఫిలిప్పినో అవార్డుల కార్యక్రమంలో తాను హంతకుడ్ని కాదని చెప్పిన రోడ్రిగో, తాజాగా తాను హంతకుడినని అంగీకరించడం విశేషం. 

More Telugu News