: ఈస్ట్రన్ రైల్వేస్ కు బెదిరింపులేఖ...50 కోట్లు ఇస్తే సరే...లేకుంటే చూస్కోండి!

అసాంఘిక శక్తులు సాధారణంగా వ్యక్తులను కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగుతాయి. లేదా సంస్థలపై హ్యాకింగ్ వల వేసి బ్లాక్ మెయిల్ కి పాల్పడతాయి. అయితే, ఇంత వరకు చోటుచేసుకోని విధంగా తూర్పు రైల్వేకు బెదిరింపు లేఖ వచ్చింది. 50 కోట్ల రూపాయలు తక్షణం ఇవ్వని పక్షంలో హౌరా డివిజన్‌ లోని ప్రయాణికులకు హాని తలపెడతామని, రైళ్లకు ఇబ్బందులు సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ కోల్‌ కతాలోని తూర్పు రైల్వే డివిజన్ కార్యాలయానికి ఒక లేఖ అందింది. దీంతో అప్రమత్తమైన తూర్పు రైల్వే డివిజన్ మేనేజర్ ఆర్.బద్రినారాయణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చేతితో రాసిన బెదిరింపు లేఖ ఒకటి అందిందని అన్నారు. దానిని విచారణ నిమిత్తం పోలీసులకు అందజేశామని చెప్పారు. ఈ లేఖలో ఫోన్ నెంబర్ కూడా రాశారని, వారి డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రైల్వేలకు హాని తలపెడతామన్నారని ఆయన తెలిపారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. 

More Telugu News