: రేణిగుంట విమానాశ్రయం టాప్ లేచింది... విమానాల దారి మళ్లింపు!

వార్థా విశ్వరూపానికి చెన్నైతో పాటు ఆ పరిసర ప్రాంతాలు కూడా వణికిపోతున్నాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి పైకప్పులు ఎగిరిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం కూడా వార్థా బాధితురాలిగా మారింది. వార్థా ధాటికి వీస్తున్న గాలుల కారణంగా విమానాశ్రయంలోని పైకప్పుకు చిల్లుపడింది. భీకరమైన గాలులకు తోడు వర్షం కూడా కుండపోతగా కురుస్తుండడంతో విమానాశ్రయం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో విమానాశ్రయం మూసివేశారు. ఇక్కడికి రావాల్సిన విమానాలను హైదరాబాదుకు దారి మళ్లించారు. 

More Telugu News