: ‘ధృవ’లో రాంచరణ్ అద్భుతంగా నటించాడు: దర్శకుడు రాజమౌళి

‘ధృవ’ చిత్రంలో రాంచరణ్ హావభావాలు చాలా బాగున్నాయని, తన శరీరాకృతితో అద్భుతంగా కనిపించాడని ప్రముఖ దర్శకుడు రాజమౌళి కితాబు ఇచ్చారు. ఈ మేరకు రాజమౌళి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు. రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డికి తన అభినందనలు అని, ఇమేజ్ ను పక్కన పెట్టి కథకు ప్రాముఖ్యత ఇవ్వడంతో చాలా ఆసక్తిగా అనిపించిందని రాజమౌళి పేర్కొన్నారు. తమిళ్ 'ధృవ' చిత్రంలో నిరూపించుకున్న నటుడు అరవింద్ స్వామి, తెలుగులో కూడా బాగా చేశాడని, రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుందని రాజమౌళి ప్రశంసించారు. ఈ చిత్రం కథ రాసిన వ్యక్తికి మంచి మార్కులు దక్కుతాయని, అతనే రియల్ హీరో అని ఆ ట్వీట్ లో రాజమౌళి అన్నారు.

More Telugu News