: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇస్తాంబుల్.. 15 మంది దుర్మరణం

బాంబు పేలుళ్లతో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ దద్దరిల్లింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఇస్తాంబుల్‌లో శనివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం రెండు శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, 69 మంది గాయపడినట్టు ఆరోగ్యశాఖామంత్రి తెలిపారు. తొలి పేలుడు స్టేడియం బయట పార్క్ చేసిన కారులో సంభవించినట్టు పేర్కొన్నారు. దానికి సమీపంలో ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడు తనను తాను పేల్చేసుకుని దాడికి పాల్పడ్డాడు. పోలీస్ బస్సే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడినట్టు అంతర్గత శాఖామంత్రి సులేమాన్ సోయులు తెలిపారు. వీలైనంత ప్రాణ నష్టం కలిగించడమే లక్ష్యంగా బాంబు పేలుళ్లు జరిగినట్టు అధ్యక్షుడు రెసెప్ తయ్యపి ఎర్డోగాన్ తెలిపారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు.

More Telugu News