: డిజిటల్ నెలగా డిసెంబరు.. బ్యాంకర్ల సూచనకు చంద్రబాబు సై!

డిసెంబరు నెలను డిజిటల్ నెలగా పరిగణించాలన్న బ్యాంకర్ల సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సై అన్నారు. నోట్ల రద్దు పరిస్థితులపై చర్చించేందుకు శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బ్యాంకర్లు ఈ ప్రతిపాదన చేశారు. దీనిని ముఖ్యమంత్రి స్వాగతించారు. నోట్ల రద్దుతో నగదు కొరత ఉందని, ఖర్చులను వాయిదా వేసుకోవాల్సిన పనిలేదని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. డిజిటల్ లావాదేవీల్లోకి మారితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల వల్ల దేశంలో నగదు చలామణి గతంతో పోలిస్తే రూ.5 లక్షల కోట్ల వరకు తగ్గుతుందని చెప్పారు. రాష్ట్రంలోని బ్యాంకు చెస్టుల్లో ఉన్న రూ.750 కోట్లతోపాటు శుక్రవారం రిజర్వుబ్యాంకు పంపిన రూ.1450 కోట్లు కలిపి మొత్తం నగదును సక్రమంగా పంపిణీ చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వరుస సెలవులతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏటీఎంలలో నగదు నిల్వలు పెంచాలని ఆదేశించారు.

More Telugu News