: మంత్రి బంధువైనా అరెస్ట్ చేస్తాం: కేటీఆర్ స్పష్టీకరణ

నానక్ రామ్ గూడాలో కుప్పకూలిన భవంతి యజమాని ఓ మంత్రి దగ్గరి బంధువని వస్తున్న కథనాలపై కేటీఆర్ స్పందించారు. ఈ ఉదయం ఘటనా స్థలి వద్ద మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో నిందితుడు మంత్రి బంధువైనా వదిలిపెట్టేది లేదని, అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. లక్ష పరిహారాన్ని ప్రకటించిన ఆయన, స్థానిక డిప్యూటీ కమిషనర్ ను, ఏసీపీని విధుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. తాను ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు. బిల్డర్ల దురాశతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్కువ స్థలంలో భారీ భవంతిని నిర్మిస్తుండటం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. నిందితుడు, భవన యజమాని సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, ఆయన శబరిమల వెళ్లినట్టు చెబుతున్నారని, ఎలాగైనా ఆయన్ను అరెస్ట్ చేసి తీరుతామని అన్నారు.

More Telugu News