: రెండుసార్లు రికార్డు సృష్టించిన అమెరికా దిగ్గజ వ్యోమగామి జాన్ గ్లెన్ కన్నుమూత

అమెరికా స్పేస్ దిగ్గజం జాన్ గ్లెన్(95) కన్నుమూశారు. భూకక్ష్యలోకి ప్రవేశించిన మొట్టమొదటి అమెరికన్‌గా, అంతరిక్షంలోకి వెళ్లిన తొలి సీనియర్ సిటిజన్‌గా రికార్డు సృష్టించిన గ్లెన్ మృతి చెందినట్టు అతడి పేరుపై ఉన్న ఓహియో కాలేజ్ గురువారం ప్రకటించింది. గ్లెన్ మృతి వార్త తెలిసిన అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా నివాళులు అర్పించింది. అతడిని ‘హీరో’గా అభివర్ణించింది. గ్లెన్ ఆ తర్వాత రెండు దశాబ్దాలకుపైగా సెనేటర్‌గా సేవలందించారు. సెనేటర్ జాన్ గ్లెన్ మృతి తమకు తీరని లోటని నాసా ట్వీట్ చేసింది. భూకక్ష్యలోకి ప్రవేశించిన తొలి అమెరికన్ అయిన గ్లెన్ హీరో అని అభివర్ణించింది. 2014లో హృదయ కవాటాల మార్పిడి తర్వాత గ్లెన్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. గురువారం గుండెపోటుకు గురైన ఆయన ఓహియోలోని కొలంబస్‌లో తుదిశ్వాస విడిచారు.

More Telugu News