: హైదరాబాద్‌లో పెను విషాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. శిథిలాల కింద నాలుగు కుటుంబాలు

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో పెను విషాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఏడంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. శిథిలాల కింద నాలుగు కుటుంబాలకు చెందిన 13 మంది కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సహాయక సిబ్బంది ఇప్పటి వరకు ఓ మహిళ, చిన్నారిని రక్షించారు. బాధిత కూలీలందరూ విజయనగరం, చత్తీస్‌గఢ్‌లకు చెందిన వారుగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం పైప్ ద్వారా ఆక్సిజన్ పంపిస్తున్నారు. సహాయక చర్యలు రాత్రి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భవనం కుప్పకూలిన విషయం తెలుసుకున్న మంత్రులు నాయిని నరసింహారావు, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అనుమతి లేకున్నా ఏడంతస్తులు కట్టడంతోపాటు నాసిరకం నిర్మాణం కారణంగానే బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

More Telugu News