: బ్యాట్స్ మన్, ఫీల్డర్ రిటైర్డ్ హర్ట్ అవడం తెలిసిందే... ముంబై టెస్టులో ఏకంగా అంపైర్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఊహించని విచిత్రం చోటు చేసుకుంది. సాధారణంగా ఏ మ్యాచ్ లో అయినా బ్యాట్స్ మనో లేక ఫీల్డరో రిటైర్డ్ హర్ట్ కావడం మనకు అందరికీ తెలిసిందే. కానీ, ముంబై టెస్టులో ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 49వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జెన్నింగ్స్ సింగిల్ తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఆ బంతిని ఫీల్డ్ చేసి, విసిరాడు. ఆ బంతి నేరుగా అంపైర్ పాల్ రీఫెల్ తల వెనుకభాగంలో తగిలింది. దీంతో, అతను కిందకు పడిపోయాడు. వెంటనే ఫిజియోలు ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. తర్వాత ఆయన ఫీల్డ్ వదిలి వెళ్లిపోయాడు. ఆయన స్థానంలో టీవీ అంపైర్ ఎరస్ మస్ ఫీల్డ్ అంపైర్ గా వచ్చాడు.

More Telugu News