: పుణ్యక్షేత్రమైన జయలలిత సమాధి ... తలనీలాలిస్తున్న వేలాది మంది తమిళులు

చెన్నై మెరీనా బీచ్, అందునా ఎంజీఆర్, జయలలిత సమాధులు ఉన్న ప్రదేశం ఇప్పుడో పుణ్యక్షేత్రంలా మారింది. నిన్న జరిగిన జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన అసంఖ్యాక తమిళులు నేడు ఆమె సమాధిని దర్శించుకుని కన్నీరు కారుస్తున్నారు. తమ ఆరాధ్య దేవతను గుర్తు చేసుకుంటూ వేలాది మంది తలనీలాలు సమర్పిస్తున్నారు. దీంతో అక్కడ తలనీలాల వ్యాపారం జోరుగా సాగుతోంది. అమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలుంచుతూ నివాళులు అర్పిస్తున్న వారితోనూ, గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలతోనూ అన్నాసాలై కిక్కిరిసిపోయింది. ఇక నేడు వీఐపీల తాకిడి లేకపోవడంతో, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, సాధారణ ప్రజలను దగ్గర్నుంచీ సమాధిని చూసేందుకు ఏర్పాటు చేసి, ప్రజలను నియంత్రిస్తున్నారు.

More Telugu News