: జయ సన్నిహితుడు, రమ్యకృష్ణ మేనమామ 'చో' గురించి కొన్ని విశేషాలు

ఎప్పుడూ నున్నగా గీసిన గుండు, నుదుటన విభూది బొట్టు, సఫారీ డ్రెస్, పెద్ద కళ్లజోడు... ఇది చో రామస్వామి స్వరూపం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆయన సన్నిహితుడు. అంతేకాదు, ప్రముఖ సినీనటి రమ్యకృష్ణకు స్వయానా మేనమామ. 82 ఏళ్ల చో రామస్వామి అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గురించి కొన్ని విశేషాలను తెలసుకుందాం. * చో రామస్వామి సినిమా నటుడే కాదు... దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్, నాటక రచయిత కూడా. * మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు మీద 'తుగ్లక్' అనే పత్రికను స్థాపించారు. * 1968 లో 'తుగ్లక్' అనే నాటకాన్ని రచించి... దాన్ని కనీసం 2000 సార్లు ప్రదర్శించారు. ఇందిరాగాంధీని విమర్శిస్తూ ఈ నాటకాన్ని రచించారాయన. * 57 సినిమాల్లో నటించారు. * 37 సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు. * జయలలితకు అత్యంత సన్నిహితులు. రాజకీయ సలహాదారు కూడా. * ఎవరి మాట వినని జయలలిత... కేవలం చో మాట మాత్రమే వింటారని చెప్పుకుంటుంటారు. * ఆలోచనలు స్పష్టంగా ఉండటం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం చో రామస్వామి వ్యక్తిత్వం. ఈ లక్షణాలే ఆయనను జయకు చేరువ చేశాయి. * ముఖ్యమంత్రి పదవికి జయలలిత కంటే రామస్వామే బెటర్ అనేది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిప్రాయం. * రిజర్వేషన్లకు రామస్వామి వ్యతిరేకం. * ప్రధాని మోదీకి కూడా రామస్వామి మంచి మిత్రుడు. జయకు, మోదీకి సత్సంబంధాలు ఏర్పడటానికి రామస్వామే కారణం. * తన సన్నిహితురాలు జయలలిత చికిత్స పొందిన అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ రామస్వామి కన్నుమూశారు.

More Telugu News