: నాడు జయలలిత ఇంట్లో దొరికినవి ఇవే... తెలిస్తే అవాక్కు కావాల్సిందే!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగివున్నారన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు, 1996 జనవరిలో జయలలితతో పాటు ఆమె స్నేహితురాలు శశికళ, పెంపుడు కుమారుడు సుధాకరన్, ఇతర బంధువులను నిందితులుగా చేరుస్తూ, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆపై జయలలితను అరెస్ట్ చేసి జైలుకు పంపగా, పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఇంట పట్టుబడిన వస్తువుల జాబితా చూస్తే ఎవరైనా అవాక్కు కావాల్సిందే. 28 కిలోల బంగారం, 880 కిలోల వెండి, 10,500 చీరలు (వీటిల్లో అత్యధికం విలువైన పట్టు చీరలే), 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు, వివిధ ప్రాంతాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన 306 దస్త్రాలు లభించాయి. 1991లో కేవలం రెండు కోట్ల రూపాయల ఆస్తులను ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో చూపిన జయలలిత, ఆపై ఐదారేళ్లలోనే ఇంత భారీగా ఆస్తులను కూడబెట్టిన విధానం చూసి న్యాయమూర్తులే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లోనే జయ ఆస్తుల విలువ 66 కోట్ల 65 లక్షల రూపాయలని అంచనా వేశారు.

More Telugu News