: ఆ వీణకు ‘వంగవీటి వీణ’ అని పేరుపెట్టుకున్నాను: పాటల రచయిత రాజశేఖర్ పన్నాల

వంగవీటి రంగా ఇచ్చిన డబ్బులతో తాను వీణ కొనుక్కున్నానని ‘వంగవీటి’ చిత్రం పాటల రచయిత రాజశేఖర్ పన్నాల అన్నారు. వంగవీటి రంగాతో తన అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు నా మొదటి కచేరి త్యాగరాయ ఉత్సవాల్లో చేశాను. ఆ కచేరికి వంగవీటి రంగాగారు అతిథిగా వచ్చారు. కచేరి తర్వాత రంగా గారు నాకు ఏడు వందల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో నేను వీణ కొనుక్కున్నాను. అప్పటి వీణ ఇప్పటికీ ఉంది. నా దగ్గర తంజావూరు, బొబ్బిలి... వీణలు ఉన్నాయి. రంగా గారిచ్చిన డబ్బులతో కొనుక్కున్న వీణను ‘వంగవీటి వీణ’ అని పిలుచుకుంటాను. ఆ వీణపై ‘వంగవీటి’లో పాట వాయించి.. ఆ వీడియోను వర్మకు పంపాను’ అని రాజశేఖర్ పన్నాల పేర్కొన్నారు. ఈ చిత్రంలో ‘వంగవీటి..వంగవీటి..ఇది వంగవీటి కత్తి’ అనే పాటను తాను రాయడమే కాకుండా పాడటం కూడా జరిగిందని అన్నారు. వాస్తవానికి తాను బాత్రూం సింగర్ ని కూడా కాదని, దర్శకుడు వర్మే తన చేత ఈ పాట పాడించారని ఆయన చెప్పారు.

More Telugu News