: పన్ను పరిధికి మించి బ్యాంకుల్లో జమచేసిన ఒక్క రూపాయికి కూడా పన్ను కట్టాల్సిందే: జైట్లీ

అక్రమార్కులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని బ్యాంకుల్లో వేసి, అది తెల్లధనంగా మారిందని సంబరాలు చేసుకుంటున్నారని, కేవలం బ్యాంకుల్లో వేసినంత మాత్రాన అది తెల్లధనం కాదని, దానిపై పన్ను చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను పరిధికి మించి ఒక్క రూపాయి లావాదేవీ అధికంగా జరిగినా పన్ను చెల్లించక తప్పదని తెలిపారు. ప్రజలు బ్యాంకుల ఎదుట పడుతున్న కష్టాల గురించి ప్రశ్నించగా, ఇబ్బందులన్నీ తగ్గుతాయని, రూ. 500 నోట్ల సరఫరాను పెంచామని పేర్కొన్నారు. ద్రవ్య నిర్వహణ, బడ్జెట్ మేనేజ్ మెంట్ నిబంధనల్లో సడలింపులు కావాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని జైట్లీ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొన్ని ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన, బ్యాంకుల వద్ద త్వరలోనే రద్దీ తగ్గి సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

More Telugu News